పోలీసులపై గంజాయి బ్యాచ్ దాడి

కలం, వెబ్ డెస్క్: పోలీసులపై గంజాయి బ్యాచ్ దాడి చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాలో చోటుచేసుకుంది. స్థానికంగా గుగులోత్ మంగీలాల్, బానోత్ భాస్కర్ కుటుంబాల మధ్య కొంతకాలంగా పాత కక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఇరు కుటుంబాల మధ్య మరోసారి వివాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది. పరిస్థితి అదుపు తప్పడంతో తండా వాసులు డయల్ 100కు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే గంజాయి మత్తులో ఉన్న మంగీలాల్ కుమారులు గుగులోత్ రవి, కుమార్ పోలీసులపైనే దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు అయ్యాయి.

పరిస్థితిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గాయపడిన సిబ్బందికి చికిత్స అందించారు. అనంతరం కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు గుగులోత్ రవి, కుమార్‌తో పాటు బానోత్ భాస్కర్, పద్మలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు అప్రమత్తంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Read Also: గుడ్ న్యూస్.. తెలంగాణకు మరో రెండు కొత్త ఎయిర్ పోర్టులు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>