‘ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని’.. అమరావతిపై సీఎం చంద్రబాబు స్పష్టత

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) రాజధాని అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) మరోసారి స్పష్టత ఇచ్చారు. ఇకపై ‘మూడు ముక్కలాట’ ఉండదు.. అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఒకే రాష్ట్రానికి ఒకే రాజధాని అనే విధానంతో ముందుకు సాగుతామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరని సీఎం స్పష్టం చేశారు. అమరావతి (Amaravati)  ప్రజా రాజధానిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

అమరావతి పేరు వినగానే కొందరికి నిద్ర పట్టదని వ్యాఖ్యానించిన చంద్రబాబు, రాజధానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పారు. ఒకే రాజధాని లక్ష్యంతో అమరావతిని మరింత అభివృద్ధి చేస్తామని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం హామీ ఇచ్చారు.

Read Also: ఆది కుంభేశ్వర ఆలయం: ఈ ఒక్క పని చేస్తే శత్రుజయం తథ్యం!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>