పట్టపగలే ఇంట్లో చోరీ.. రూ.30 వేల నగదు, బంగారం అపహరణ

కలం, జోగులాంబ గద్వాల : గద్వాల (Gadwal ) మండలం తుర్కోంపల్లి గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది. సోమవారం ఉదయం తలారి నర్సింహులు ఇంటి తాళం పగలగొట్టి లోపలకు ప్రవేశించిన దుండగలు రూ.30వేల నగదు, 5-6 తులాల బంగారు, కొంత వెండి పట్టీలు దోచుకెళ్లారు. బాధితుల కథనం మేరకు నర్సింహులు తన భార్యతో కలిసి వైద్యం కోసం గద్వాల పట్టణానికి వెళ్లారు. వైద్య అనంతరం తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి చేరుకున్నారు.

అయితే తాళం వేసిన ఉన్న తలుపులు తీసి ఉండటంతో దొంగతనం జరిగిందని ఆందోళనతో లోపలకు వెళ్లి చూసుకున్నారు. దుండగులు బీరువాను పగలగొట్టి అందులో భద్రపరిచిన 5-6 తులాలు బంగారు ఆభరణాలు, వెండీ పట్టీలు, రూ.30 వేలు నగదు పట్టుకుపోయారని గుర్తించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గద్వాల రూరల్ ఎస్ఐ శ్రీకాంత్, సిసిఎస్ ఎస్ఐ శేఖర్ సంఘటన స్థలాని పరిశీలించారు. క్లూస్‌టీమ్‌ ద్వారా వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>