కలం, జోగులాంబ గద్వాల్: భూ భారతి (Bhu Bharathi) ఆపరేటర్లకు వెంటనే వేతనాలు చెల్లించాలని తెలంగాణ భూ భారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. భూ భారతి ప్రాజెక్ట్ కింద పనిచేస్తున్న 636 మంది ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ ఉద్యోగుల సేవలను 2026-27 ఆర్థిక సంవత్సరానికి రెన్యూవల్ చేయాలన్నారు. గత 15 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆయా జిల్లాల్లో కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల్లో ఆపరేట్లరు భూ భారతి (Bhu Bharathi) సేవలు కొనసాగిస్తున్నారని, సకాలంలో వేతనాలు అందకపోడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. నెలనెలా ఇంటి ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను క్రమబద్ధీకరిస్తామని చెప్పి, కనీసం వేతనాలను కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 5 నెలల బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని కోరారు.
Also Read : తిట్టడం గొప్ప కాదు.. యువతకు మను బాకర్ హితవు!
Follow Us On: Sharechat

