మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

కలం, వెబ్ డెస్క్ : దేశంలో మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు (Fuel Rates) పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్‌పై 83 పైసలు చొప్పున చమురు సంస్థలు ధరలను పెంచాయి. నాలుగు రోజుల వ్యవధిలో ఇది రెండోసారి ఇంధన ధరల పెంపు కావడం గమనార్హం. వరుసగా పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలపై మరింత భారం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో  ముడి చమురు ధరల (Crude Oil Prices) పెరుగుదల, డాలర్‌తో రూపాయి మారకం విలువలో మార్పులు వంటి కారణాలతో ఆయిల్‌ కంపెనీలు ధరలను సవరించినట్లు తెలుస్తోంది.

తాజా పెంపుతో దేశంలోని పలు నగరాలలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు (Fuel Rates) కొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇంధన ధరల పెరుగుదల మరో దెబ్బగా మారింది. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, ఇతర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక రాష్ట్రాల వారీగా వ్యాట్‌, స్థానిక పన్నుల ఆధారంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలలో స్వల్ప తేడాలు ఉండనున్నాయి.

Read Also: పుచ్చకాయ తింటే చనిపోతారా? వైరల్ వార్తలపై డాక్టర్ల క్లారిటీ!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>