కలం, వెబ్ డెస్క్ : సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతూ ఇంధన ధరలు (Fuel Price) మరోసారి భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల నెపంతో లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఈ ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచే అమలులోకి వచ్చాయి.
ఈ ఒక్క నెలలోనే ఇంధన ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.84కు చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ.100.94కు చేరుకుంది. వరుసగా పెరుగుతున్న ధరలతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలపై ఆ ప్రభావం పడుతుందని సామాన్యులు వాపోతున్నారు.

