ఖండాంతరాలు దాటిన ప్రేమ.. లండన్ యువతితో ఆదిలాబాద్ యువకుడి పెళ్లి

కలం, వెబ్ డెస్క్: ఆదిలాబాద్‌కు (Adilabad) చెందిన యువకుడు లండన్ యువతిని పెళ్లి (Marriage) చేసుకున్నాడు. ఆదిలాబాద్ పట్టణం కృష్ణానగర్‌కు చెందిన సాయిచరణ్ పదేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఈ క్రమంలో ఆయనకు లండన్‌లోని (London) కార్డిఫ్‌కు చెందిన మియామేతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించిన ఈ జంట హిందూ సంప్రదాయం ప్రకారం మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. విదేశీ యువతి భారతీయ సంప్రదాయ పద్ధతిలో ఆదిలాబాద్ యువకుడిని పెళ్లాడటం స్థానికంగా అందరినీ ఆకట్టుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>