నర్సింగ్ ఆఫీసర్‌లకు నియామక పత్రాలు

కలం, వెబ్ డెస్క్ : ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఆరోగ్యశాఖలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రేపు (12 మే 2026) నియామక పత్రాలను (Appointment Letters) అందజేయనున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ  గ్రౌండ్స్‌లో సాయంత్రం 5 గంటలకు నిర్వహించబడుతుంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ (Damodar Raja Narasimha) ఎంపికైన నర్సింగ్ ఆఫీసర్‌లకు (Nursing Officers) అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ అందజేయనున్నారు.

ఈ సందర్భంగా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఆరోగ్యశాఖలో 1919 పోస్టులు, లేబర్ డిపార్ట్‌మెంట్‌లో 257 నర్సింగ్ ఆఫీసర్ (Nursing Officers) పోస్టులను భర్తీ చేశారు. ఇందులో ఆరోగ్యశాఖకు ఎంపికైన 1919 మంది అభ్యర్థులకు మంగళవారం నియామక పత్రాలు అందించనున్నారు. ఈ కార్యక్రమంతో ప్రభుత్వ ఆసుపత్రులలో నర్సింగ్ సిబ్బంది కొరత కొంత మేర తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Read Also: వైకల్యాన్ని ఎదిరించి.. కష్టాల కడలిని దాటి.. ఆదిలాబాద్ యువకుడి సక్సెస్ స్టోరీ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>