నేతన్నలకు ఉచిత విద్యుత్: నేటి నుంచే అమలు

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత, పవర్ లూమ్ కార్మికులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ప్రకటించిన ఉచిత విద్యుత్ (AP Free Electricity) పథకం నేటి నుంచే అమల్లోకి వస్తోంది. ఈ పథకం ద్వారా అటు చేనేత రంగానికి, ఇటు పవర్ లూమ్ రంగానికి ప్రభుత్వం భారీ ఊరటను కల్పించనుంది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పవర్ లూమ్ రంగంలో పనిచేసే శ్రామికులకు ప్రతి నెలా 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (Free Electricity) సరఫరా చేయనుండగా, చేనేత శ్రామికులకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందించనున్నారు. ఈ నిర్ణయం వల్ల వేలాది నేతన్నల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

ఈ పథకం ద్వారా పవర్ లూమ్ కుటుంబాలకు నెలకు దాదాపు 2000 రూపాయల నుండి 2200 రూపాయల వరకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదేవిధంగా, చేనేత కార్మికుల కుటుంబాలకు నెలకు 700 రూపాయల నుండి 800 రూపాయల వరకు ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు. పెరుగుతున్న విద్యుత్ భారంతో ఇబ్బందులు పడుతున్న నేతన్నలకు ఈ పథకం ఒక గొప్ప చేయూతగా మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read Also: పెరిగిన ఈవీ క్రేజ్.. కానీ అసలు సవాల్ ఇదే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>