కలం, వెబ్ డెస్క్: ఏ మాత్రం కనికరం లేకుండ ఓ దుర్మార్గుడు.. నాలుగేళ్ళ పిల్లాడిని నేలకేసి కొట్టాడు. మహారాష్ట్ర (Maharashtra)లోని వసాయి ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఆటోలో పిల్లాడు ఆడుకుంటున్న టైంలో ఒక్కసారిగా దూసుకొచ్చి.. ఆ పిల్లాడిని ఆటోలో నుంచి బయటకు లాగి నేలకేసి ఘోరంగా కొట్టాడు. ఆపై ఆ బాలుడిని తలక్రిందులుగా పట్టుకుని అక్కడి నుంచి పారిపోయాడు. పిల్లాడి తండ్రి తనతో గొడవ పడ్డాడని కోపం పెంచుకున్న దుర్మార్గుడు.. ఆ చిన్నారిపై ఇలా కోపం ప్రదర్శించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకునం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను గుర్తించి మరింత దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యంత పాశవికంగా చిన్నారిపై దుర్మార్గుడు ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. చిన్నారి తండ్రిపై కోపం ఉంటే.. పెద్దవాళ్ళు చోసుకోవాలి కానీ, ఇలా అభం శుభం తెలియని చిన్నారులను ఇంత దారుణంగా నేలకేసి కొడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి పోలీసులు కఠిన శిక్ష విధించాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భయానక శిక్ష వేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

