కలం వెబ్ డెస్క్ : నంద్యాల(Nandyal) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ(Allagadda) మండలం బత్తలూరు దగ్గర శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు, ట్రావెల్స్ బస్సును ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. దీంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. కారు అతివేగంతో ఉండటం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు అదుపు తప్పి డివైడర్ ను దాటి ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. కారు పూర్తిగా ధ్వంసం కావడంతో మృతదేహాలను బయటకు తీయడం ఇబ్బందిగా మారింది.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులను హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా క్యాటరింగ్ సిబ్బంది అని సమాచారం. యాత్రకు వెళ్లే వారి కోసం వంట చేసేందుకు కారులో వచ్చారు. మృతుల్లో గుండేరావు, శ్రవణ్, నరసింహా బన్నీలు ఉన్నారు. గాయపడ్డ వారిలో శివసాయి, సిద్ధార్థలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Read Also: రంగారెడ్డిలో భారీగా ఆవుల అక్రమ రవాణా
Follow Us On: Sharechat


