కలం, వెబ్ డెస్క్: హిట్, ఫెయ్యిల్యూర్స్‌తో సంబంధం లేకుండా స్టార్స్‌పై అభిమానం చాటుతుంటారు ఫ్యాన్స్. థియేటర్లలోనే కాదు.. ఆన్‌లైన్‌లోనూ తమ అభిమాన హీరోల గురించి సెర్చ్ చేస్తుంటారు. ఆసక్తికర విషయాలను తెలుసుకుంటారు. ఈ ఏడాదిలో టాలీవుడ్ (Tollywood)లో ఓ ఐదుగురి స్టార్స్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2025లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన నటుల్లో ముందువరుసలో నిలిచాడు. పుష్ప 2 భారీ విజయంతో ఈ నటుడి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో ఏడాది పొడవునా అందరి దృష్టి అల్లు అర్జున్‌పై పడింది.
ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ అల్లు అర్జున్ (Allu Arjun) అట్లీ దర్శకత్వంలో పనిచేస్తుండటంతో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పేలా చేసింది. అలాగే దాదాపు ఐదేళ్ల తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్‌తో పనిచేస్తుండటం కూడా అభిమానులను ఆకర్షించింది. డిసెంబర్ 24, 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా సేకరించిన గూగుల్ సెర్చ్ డేటా ప్రకారం.. అల్లు అర్జున్ నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు, ఆ తర్వాత ప్రభాస్ రెండవ స్థానంలో నిలిచాడు.
టాప్ 5 స్టార్స్ వీరే
- అల్లు అర్జున్
- ప్రభాస్
- మహేష్ బాబు
- పవన్ కళ్యాణ్
- జూనియర్ ఎన్టీఆర్
Read Also: నాగ్ 100వ సినిమా.. తెర వెనుక ఏం జరుగుతోంది..?
Follow Us On : WhatsApp


