epaper
Wednesday, February 18, 2026
epaper

కమిషన్లు, సీబీఐ, ఈడీ… అయినా సస్పెన్స్!

కలం, తెలంగాణ బ్యూరో:  పాత ప్రభుత్వ తప్పుల్ని తవ్వితీయడం రాజకీయ పార్టీలకు రొటీన్ ప్రాక్టీస్‌. తెలంగాణలోనూ అదే ట్రెండ్. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు జరిగాయన్నది కాంగ్రెస్ వాదన. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న మూడు బ్యారేజీలు గత ప్రభుత్వంలోనే డ్యామేజ్ అయ్యాయి. ఉచిత గొర్రెల పథకం అమలులో అవకతవకలు కూడా అప్పట్లోనే వెలుగులోకి వచ్చాయి. వీటితో పాటు ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో అవినీతి, సీఎంఆర్ఎఫ్ దుర్వినియోగంపైనా ఆరోపణలు, ఫిర్యాదులు (BRS Era Cases) వచ్చాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై దర్యాప్తు మొదలుపెట్టింది. కొన్ని అంశాలపై రిటైర్డ్ జడ్జీలతో కమిషన్‌లు నియమించింది. విచారణ అనంతరం ప్రభుత్వానికి నివేదికలూ సమర్పించాయి. కొన్ని కేసుల్ని ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. మరికొన్నింటిలో ఈడీ ఎంటర్ అయింది. పార్టీల పరస్పర విమర్శల కోసం ఈ కేసులు ఉపయోగపడుతున్నాయి. రెండేండ్లు దాటినా ఇవేవి కొలిక్కి రాలేదు. నిందితులెవరో, బాధితులెవరో తెలియదు. కంచికి చేరకుండా ఉండిపోయిన ఈ కేసుల్లో దోషులెవరో, వారికి పడే శిక్షలేంటో సస్పెన్స్.

BRS Era Cases

రెండేళ్లుగా సా.. గుతున్న కేసులు, వాటి దర్యాప్తులపై ‘కలం 360 డిగ్రీస్’ స్పెషల్ కోసం కింద ఉన్న పేపర్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి.

Read Also: ‘సుప్రీం’ను మెప్పించి పది నిమిషాల్లో ఎంబీబీఎస్​ సీట్​ పట్టేశాడు​!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>