కలం, వెబ్ డెస్క్: Suryapet | రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. చాలా గ్రామాల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఎస్సై ఉద్యోగానికి రాజీనామా చేసి బరిలో నిలిచిన ఓ అభ్యర్థి ఓటమి పాలయ్యాడు.
సూర్యాపేట(Suryapet) జిల్లా కోదాడ మండలం గుడిబండకు చెందిన వెంకటేశ్వర్లు.. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎస్సై పోస్టుకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇంకా కొంత సర్వీస్ ఉన్నప్పటికీ వీఆర్ఎస్ తీసుకున్నారు. ఈ వార్త అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే వెంకటేశ్వర్లు పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) ఓటమి పాలయ్యాడు. ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి మద్దతు తెలిపారు. కాంగ్రెస్ మద్దతుదారుడిగా పోటీ చేశారు. అయినప్పటికీ ఆయనకు విజయం దక్కలేదు.
Read Also: మూడో విడతపై కాంగ్రెస్ ఫోకస్
Follow Us On: Pinterest


