epaper
Monday, March 2, 2026
epaper

నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా ఆమోదం

కలం, వెబ్‌డెస్క్: నెల్లూరు మేయర్‌ స్రవంతి (Nellore Mayor)  రాజీనామాను కలెక్టర్ ఆమోదించారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె రాజీనామా చేశారు. తన మీద కుట్రలు చేస్తున్నారని.. తనకు మద్దతు ఇచ్చే కార్పొరేటర్లను వేధిస్తున్నారని స్రవంతి(Potluri Sravanthi) ఆరోపించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయ పేషీలో తన ప్రతినిధి ద్వారా రాజీనామా లేఖను సమర్పించారు. కాగా ఆమె రాజీనామాను కలెక్టర్ ఆమోదించారు. నిబంధనల ప్రకారం ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ తాత్కాలిక మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు.

రెగ్యులర్ మేయర్ ఎన్నిక పూర్తయ్యే వరకు ఆయన మేయర్‌(Nellore Mayor)గా కొనసాగనున్నారు. గురువారం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు క్యాంపు రాజకీయాల్లో భాగంగా పలువురు కార్పొరేటర్లు ప్రస్తుతం గోవాలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత కొత్త మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

Read Also: బెంగాల్‌లో ‘సర్’ చిచ్చు.. 58 లక్షల ఓట్లు గాయబ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!