కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు (Rathod Bapu Rao) ఆదివారం హైదరాబాద్‌లో కవిత (Kavitha) సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవిత నాయకత్వంలో తెలంగాణలోని అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కల్వకుంట్ల కవిత తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. కవిత స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీలో తాను క్రియాశీలక పాత్ర పోషిస్తానని, త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహించి తన అనుచరులతో కలిసి పార్టీలో అధికారికంగా చేరుతానని వెల్లడించారు.
రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినా, తెలంగాణ ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదని బాపురావు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నప్పటికీ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆశించిన మేర న్యాయం జరగలేదని ఆయన పేర్కొన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాటం కొనసాగిస్తానని, కేవలం కవిత నాయకత్వంలోనే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులందరూ ఏకమై కవిత వెంటే నడవాలని ఈ సందర్భంగా ఆయన (Rathod Bapu Rao) పిలుపునిచ్చారు.
Read Also: ఆపరేషన్ ఆక్టోపస్ 2.0.. దేశ వ్యాప్తంగా 52 మంది అరెస్ట్!
Follow Us On: Sharechat

