కలం, కరీంనగర్ బ్యూరో : పాఠశాల స్థాయి నుంచే బలమైన విద్య పునాదిని నిర్మించుకుంటే లక్ష్యసాధన సాధ్యమవుతుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) విద్యార్థులకు సూచించారు. కరీంనగర్ రేకుర్తిలోని ఎలైట్ హోటల్ వేదికగా రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్ (ఐఐటి, జేఈఈ, నీట్ శిక్షణ) ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రమ శిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలమని చెప్పారు. కరీంనగర్ లో ఫౌండేషన్ కోచింగ్ ను అందుబాటులోకి తీసుకువస్తున్న రెసొనెన్స్ విద్యా సంస్థలను ఆయన అభినందించారు. 6 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఈ సందర్బంగా విధ్యార్థుల మెదడు పదునుకు ఉపయోగపడే 5 సూత్రాలను వివరించారు. ప్రతి రోజు విద్యార్థులు 21 గుంజీలు, వంద నుంచి ఒకటి వరకు లెక్కపెట్టడం, జడ్ నుంచి ఏ వరకు చదవడం, సుడోకు, పజిల్ ను సాల్వ్ చేయడం ద్వారా మెదడుకు పదును లభిస్తుందని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే చిన్న దేశమైన సౌత్ కొరియా ఈ సూత్రాలను పాటించడం ద్వారా నాలుగు ప్రపంచ స్థాయి ప్రొడక్టులతో శాసిస్తున్నారని గుర్తు చేశారు. పోటీ పరీక్షలకు సిద్దమయేందుకు మెదడును పదును చేసుకోవాలని సూచించారు. జీవితంలోనూ లక్ష్య సాధనకు మూడు లక్ష్యాలను సూచించారు. అమ్మ నాన్నలు గర్వపడేలా ఎదగాలని సూచించారు. స్కూల్, కాలేజీలకు చీఫ్ గెస్ట్ గా వెళ్లాలని పేర్కొన్నారు. అదే విధంగా మీ సంతకాలే ఆటోగ్రాఫ్ లుగా మార్చే విధంగా మార్చుకున్నప్పుడే భారతదేశం గర్వపడుతుందన్నారు.
Read Also: U-18 ఆసియా కప్ సెమీస్‌లోకి భారత జట్లు
Follow Us On: X(Twitter)

