విదేశీ మహిళల్ని వేధించిన కామాంధుడు.. నడిరోడ్డుపైనే బడితపూజ!

కలం, వెబ్ డెస్క్ : భారత్‌లో పర్యటించడానికి వచ్చిన ముగ్గురు విదేశీ మహిళలకు వింత అనుభవం ఎదురైంది. వారంతా ఢిల్లీ (Delhi) వీధుల్లో తిరుగుతుండగా ఓ కామాంధులు వారిని వేధింపులకు గురి చేశాడు. దీంతో విదేశీ మహిళలు కోపాద్రిక్తులై అతనిపై తిరగబడ్డారు. అతన్ని రోడ్డుపైనే చితకాబాదారు. అతడ్ని ఉరికించి ఉరికించి మరీ కొట్టారు. ఈ ఘటన జరుగుతున్నా అక్కడున్న జనం ప్రేక్షకపాత్ర వహించడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. విదేశీయులను గౌరవించడం మన ఆతిథ్య సంస్కృతిని (అతిథి దేవో భవ) ప్రతిబింబిస్తుంది. కానీ, సదరు కామాంధుడి వల్ల మన దేశ పరువు నాశనం అవుతుందని నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ఇలాంటి వారిని ఊరికే వదిలిపెట్ట కూడదు. విదేశీ మహిళలంటే ఆట వస్తువులు అనుకుంటున్నారు’.. ‘వీరి కారణంగానే ఇండియాకు చెడ్డ పేరు వస్తోంది. విదేశీయులు ఇండియాకు రావాలంటేనే భయపడుతున్నారు’.. ‘టూరిస్ట్ ప్లేసుల్లో విదేశీయులకు తప్పకుండా రక్షణ కావాలి. ముఖ్యంగా ఇలాంటి చెత్త మనుషుల నుంచి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: సికింద్రాబాద్, రాజేంద్రనగర్‌లో కూల్చివేతలు

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>