క్రీడలకు, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత: దామోదర

కలం, వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లా సైనిక్ పురి-యాప్రాల్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఫైర్ ర్యాలీ ప్రో బ్యాడ్మింటన్ అకాడమీని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narasimha) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంస్కృతి, క్రీడలకు, నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు క్రీడా ప్రాంగణాలను, పార్కులను వినియోగించుకోవాలని కోరారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆటను ఆడారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

Read Also: సికింద్రాబాద్, రాజేంద్రనగర్‌లో కూల్చివేతలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>