​కరీంనగర్‌లో రిటైర్డ్ పోలీస్ అధికారులకు సీపీ సన్మానం

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించిన అయిదుగురు అధికారులు శనివారం ఉద్యోగ విరమణ పొందారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వీరికి సన్మాన కార్యక్రమం నిర్వహించగా.. సీపీ గౌష్ ఆలయం హాజరయ్యారు. వారిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ​ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యతాయుతమైనదని, జీవితంలో అత్యధిక భాగాన్ని ప్రజల శాంతిభద్రతల కోసం కేటాయించడం అభినందనీయమని కొనియాడారు. విధి నిర్వహణలో వారి ప్రతిభ, క్రమశిక్షణ యువ పోలీసులకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యంగా, సంతోషంగా గడపాలని ఆయన ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ ప్రతాప్, రిజర్వు ఇన్‌స్పెక్టర్ కిరణ్, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్సై మామిడి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

​పదవీ విరమణ పొందినవారు వీరే..

​1. డి. రాధాకిషన్ (రిటైర్డ్ ఎస్సై): హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పనిచేశారు. పోలీస్ శాఖలో 42 ఏళ్ల పాటు సేవలు అందించారు.

2. ఎండీ. అబ్దుల్ ఖదీర్ (రిటైర్డ్ ఏఆర్ ఎస్సై): కరీంనగర్ ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేశారు. 42 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో పనిచేశారు.

​3. వి.మల్లా రెడ్డి (రిటైర్డ్ ఏఆర్ ఎస్సై): జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించారు. 36 సంవత్సరాల పాటు పనిచేశారు.

4. పి. చంద్రమౌళి (రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్): గంగాధర పోలీస్ స్టేషన్‌లో పనిచేశారు. 35 సంవత్సరాలు పోలీస్ శాఖలో పనిచేశారు.

5. ​కె. లచ్చయ్య (రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్): కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సేవలు అందించారు. 34 సంవత్సరాలు పోలీస్ శాఖలో పనిచేసి ఈ రోజు ఉద్యోగ విరమణ పొందారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>