కలం, వెబ్ డెస్క్: కాలం వేగంగా వెళ్లిపోతున్నది. అప్పుడే 2025 ముగిసింది. ఈ ఏడాది అనేక మార్పులు, అనేక ఆవిష్కరణలు చూశాము. ఏఐ విపరీతంగా వ్యాప్తిలోకి వచ్చింది. అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. కొన్ని బహుళ జాతి సంస్థలు ఉద్యోగాల్లో కోతలు కూడా విధించాయి. ఇలా భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా అనేక విప్లవాత్మక మార్పులు చూశాము. ఇక 2026 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అంతా సిద్ధమవుతున్నారు. అయితే కొత్త ఏడాదిలో మన దేశంలో కొన్ని కొత్త నిబంధనలు (New Rules 2026) అమల్లోకి రాబోతున్నాయి. ఆ నిబంధనలు ఏమిటి? ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి అన్నది ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త ఏడాది 2026లో మన దేశంలోఅనేక నియమాలు, విధాన మార్పులు అమల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్, జీతాలు, పన్నులు, రైతులు, గృహ బడ్జెట్‌లకు సంబంధించిన ప్రభావితం చేయనున్నాయి.
బ్యాంకింగ్ రంగంలో కొత్త నిబంధనలు
కొత్త ఏడాది బ్యాంకింగ్ రంగంలో కొత్త నిబంధనలు (New Rules 2026) అమల్లోకి రానున్నాయి. క్రెడిట్ స్కోర్ వేగంగా అప్‌డేట్ కాబోతున్నది. ఇప్పటివరకు ప్రతి 15 రోజులకోసారి క్రెడిట్ స్కోర్ అప్ డేట్ అయ్యేది. అయితే కొత్త ఏడాదిలో ప్రతి వారం అప్‌డేట్ కాబోతున్నదని బ్యాంకింగ్ నిపుణలు చెబుతున్నారు. డిఫాల్టర్లను వేగంగా గుర్తించబోతున్నారు. లోన్ అర్హత, వడ్డీ రేట్ల మీద ఈ అంశం ప్రభావితం చేయబోతున్నది.
వడ్డీ రేట్ల నుంచి ఉపశమనం
SBI, PNB, HDFC వంటి పెద్ద బ్యాంకులు లోన్ వడ్డీ రేట్లను తగ్గించాయి. జనవరి నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు కూడా సవరించనున్నారు. పాన్ – ఆధార్ లింకింగ్ తప్పనిసరి డిసెంబర్ 31, 2025లోపు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే జనవరి 1, 2026 నుంచి పాన్ కార్డు ఇనాపరేటివ్ కానున్నది. బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు ఆయా పాన్ కార్డులను స్వీకరించవు. రూ.1,000 జరిమానాతో ఆలస్యంగా లింక్ చేసుకొనే అవకాశం కల్పించారు. డిజిటల్ పేమెంట్లు, యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు కఠిన నిబంధనలు పెట్టనున్నాయి. WhatsApp, Telegram వంటి యాప్‌లకు సిమ్ వెరిఫికేషన్ నియమాలు కఠినతరం కానున్నాయి.
సోషల్ మీడియా, ట్రాఫిక్ నియమాలు
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నియమాలు కఠినతరం కానున్నాయి. ఆస్ట్రేలియా, మలేషియా వంటి దేశాల్లోని చర్యల ఆధారంగా మనదేశంలోనూ వయో పరిమితి విధించే అవకాశం ఉంది. పిల్లల సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించి తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ, నోయిడా వంటి నగరాల్లో పెట్రోల్ డీజిల్ వాహనాలపై కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలయ్యే అవకాశం ఉంది.
ప్రభుత్వ ఉద్యోగులకు జీతం పెంపు
8వ వేతన సంఘం అమలు కాబోతున్నది. 7వ వేతన సంఘం డిసెంబర్ 31, 2025తో ముగియడంతో, జనవరి 1, 2026 నుంచి 8వ వేతన సంఘం అమలు అవుతుందని భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల జీతాలు, పింఛన్లు పెరగునున్నాయి. జనవరి 1 నుంచి DA కూడా పెంచే అవకాశం ఉందని సమాచారం.
రైతులకు ప్రయోజనాలు
ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో యూనిక్ ఫార్మర్ ఐటీ తప్పనిసరి కానున్నది. పీఎం కిసాన్ యోజన పొందాలంటే ఈ ఐడీ అవసరం. లేకపోతే చెల్లింపులు ఆగిపోవచ్చు. పీఎం కిసాన్ క్రాప్ ఇన్సూరెన్స్‌లో భాగంగా అడవి జంతువుల నుంచి పంట నష్టపోతే క్లెయిమ్ పొందవచ్చు. కానీ 72 గంటల్లోపు రిపోర్ట్ చేయాలి.
పన్ను చెల్లింపుదారులకు కొత్త రూల్స్
జనవరి నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR) ఫారం రావచ్చు. ఇది బ్యాంక్ లావాదేవీలు, ఖర్చులతో ప్రీ-ఫిల్డ్ అవుతుంది. ఫైలింగ్ సులువవుతుంది కానీ పరిశీలన కఠినమవుతుంది. ఎల్‌పీజీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు జనవరి 1 నుంచి సవరించనున్నారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు పెరిగితే విమాన టికెట్లు మరింత ఖరీదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాల పట్ల అలర్ట్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also: అమ్మాయిలు.. న్యూ ఇయర్ పార్టీలకు వెళ్తున్నారా, బీ అలర్ట్!
Follow Us On: X(Twitter)


