Sonbhadra Mine Collapse | ఉత్తర్‌ప్రదేశ్‌లోని సొనభద్ర జిల్లాలో రాతి గని కూలిన ఘటనలో ఇంకా ఒకరి మృతదేహం లభ్యం కాలేదు. మొత్తం రాగురు శిథిలాల కింద చిక్కుకోగా.. ఐదుగురి మృతదేహాలను భద్రతా సిబ్బంది వెలికి తీశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం సొనభద్రలోని బిల్లీ మార్కుండి గనుల ప్రాంతంలో జరిగింది. ఘటన స్థలాన్ని రాష్ట్ర మంత్రి రవీంద్ర జైస్వాల్.. సోమవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం ప్రకటించారు.
Sonbhadra Mine Collapse | “మైన్ కూలడం చాలా దారుణమైనది. ఇది ఒక ప్రమాదం. ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే తప్పకుండా చర్య తీసుకుంటాం… ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది, దర్యాప్తు ప్రారంభమైంది. మొత్తం 6 మంది కార్మికులు ఇసుకలో పూడిపోయే అవకాశముందని భావించాం, అందులో 5 మంది మృతదేహాలను బయటకు తీశాం. మరో ఒక్కరి మృతదేహం ఇంకా దొరకలేదు, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి…” అన్నారు. ‘‘ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కార్మికుడి సుమారు రూ.20 లక్షలు ఇవ్వబడతాయి” అని తెలిపారు.
Read Also: పాక్‌కు భారత సైన్యాధ్యక్షుడి స్ట్రాంగ్ వార్నింగ్
Follow Us on : ShareChat

