కలం, వెబ్‌డెస్క్: సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో హీరో శర్వానంద్ (Sharwanand) ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ ‘భోగి’ (Bhogi). ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అనుపమ కందుల సులోచన రాణి అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ సినిమా ఆగస్టు 28వ తేదీన విడుదల కానుంది.
ఈ సినిమాలో అనుపమ పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. చేతిలో క్యారేజీ, మోదుగ ఆకులు పట్టుకుని, గ్రామ నేపథ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా ఉన్న ఫస్ట్ లుక్ పోస్టల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు.
Read Also: సెలట్రిటీస్.. కాంట్రవర్సీస్
Follow Us On: X(Twitter)

