కలం, వెబ్‌డెస్క్: వికారాబాద్ (Vikarabad) జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ అన్న చేసిన పనికి మహిళా కానిస్టేబుల్‌గా పని చేస్తున్న చెల్లి తన నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో తులసిబాయి ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. తులసి బాయి ఉద్యోగరీత్యా వికారాబాద్‌లో ఉంటుండగా ఆమె అన్న రాజు నాయక్ కూడా తులసితో ఉంటున్నాడు. రాజు నాయక్ మౌనిక అనే యువతిని ప్రేమించాడు. ఆమె కూడా తులసి ఇంట్లోనే ఉంటోంది. అయితే ఇటీవల రాజు, మౌనిక మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో మౌనిక రాజుతో గొడవపడి తన ఇంటికి వెళ్లిపోయింది. మౌనికపై కోపంతో రాజు ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నాడు.
రాజు వేధింపులు తట్టుకోలేక మౌనిక పోలీసులను ఆశ్రయించింది. రాజుతో పాటు అతడి సోదరి తులసిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరిద్దరి వ్యవహారంలో తన ప్రమేయం లేకపోయినా తనపై కేసు నమోదు కావడంతో తులసి తీవ్ర మనో వేదనకు గురైంది. ఈ కేసు వల్ల కష్టపడి సాధించుకున్న ఉద్యోగం ఎక్కడ పోతుందోనని బాధపడింది. అన్న ప్రేమ వ్యవహారం, కేసులతో తన కెరీర్ నాశనం అవుతుందన్న మనస్తాపంతో తులసి ఆత్మహత్యకు పాల్పడింది. తులసి ఆవేదనతో తీసుకున్న కఠిన నిర్ణయం తన కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపింది.
Read Also: చీటింగ్ కేసుపై హైకోర్టుకు అషురెడ్డి
Follow Us On : WhatsApp

