కలం, వెబ్ డెస్క్ : ఇటలీకి చెందిన సీహెచ్-47 (CH-47) చినూక్ మిలటరీ హెలికాప్టర్ బోస్నియా-హెర్జెగోవినాలోని బ్రచ్‌కో జిల్లాలో ఘోర ప్రమాదాని (Helicopter Crash)కి గురైంది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 11 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. యూయూఎఫ్ఓఆర్ (EUFOR) అల్థియా మిషన్‌లో భాగంగా విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
బ్రచ్‌కో జిల్లాలోని గోరిస్ (Gorice) ప్రాంతంలో నివాసాలు లేని ఖాళీ ప్రదేశంలో ఈ హెలికాప్టర్ కూలిపోయింది. అయితే ప్రమాద తీవ్రతకు భారీగా ఏవియేషన్ ఇంధనం లీక్ కావడంతో అగ్నిప్రమాదం లేదా పేలుడు సంభవించే ముప్పు పొంచి ఉంది. దీంతో అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది రాత్రింబవళ్ళు అక్కడే మోహరించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనలో ఎలాంటి పౌరులకు గాయాలు కాలేదని, ఆస్తులకు నష్టం వాటిల్లలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రమాదానికి అసలు కారణమేమిటనే దానిపై యూయూఎఫ్ఓఆర్ పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.

