కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘ఫౌజీ’ (Fauzi). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మైత్రీ మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు.
‘ఫౌజీ’ (Fauzi) షూటింగ్ దాదాపు 80% పూర్తయింది. మిగిలిన యాక్షన్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది చివరిలో విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ చిత్రంలో ముఖ్యంగా వార్ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలవనున్నాయి. యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాల మేళవింపుతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు కథను తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Read Also: ‘భోగి’.. హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్!
Follow Us On: Instagram

