మ‌హిళ‌కు వేధింపులు.. రోబో అరెస్ట్‌..!

క‌లం, వెబ్ డెస్క్‌: ప్ర‌పంచంలోనే మొట్ట‌మొద‌టిసారి ఓ రోబో అరెస్ట్ (Robot Arrested) అవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చైనా (China)లోని మ‌కావులో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ మ‌హిళ‌ను వేధించిన ఘ‌ట‌న‌లో చైనా పోలీసులు రోబోను అదుపులోకి తీసుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే… చైనాకు చెందిన యునిట్రీ రోబోటిక్స్‌ సంస్థ రూపొందించిన అత్యాధునిక హ్యుమ‌నాయిడ్ రోబో యునిట్రీ జీ1 (Unitree G1)తో ఓ వ్య‌క్తి మ‌కావులో వాకింగ్ చేస్తున్నాడు. అచ్చం మనిషిలా కనిపిస్తూ, రోడ్డుపై న‌డుస్తున్న ఆ రోబోను ఓ మ‌హిళ ఆస‌క్తిక‌రంగా చూసింది. అదే స‌మ‌యంలో రోబో స‌ద‌రు మ‌హిళ‌పైకి చేతులు లేపుతూ భ‌యాందోళ‌న‌కు గురి చేసింది. మ‌హిళ రోబోను త‌న చేతిలో ఉన్న సంచితో వారిస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అనంత‌రం ఆ రోబో య‌జ‌మానిని రోబోతో ఇలా రాత్రి పూట ఎందుకు తిరుగుతున్నావ‌ని? ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు? అని గొడ‌వ‌కు దిగింది.

మహిళ ఆందోళనతో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంత‌రం పోలీసులు ఆ రోబోను స్వాధీనం (Robot Arrested) చేసుకొని అక్కడి నుంచి తీసుకెళ్లారు. స్థానిక అధికారులు ఈ విషయంపై విచారణ చేపట్టారు. పబ్లిక్ ప్రదేశాల్లో హ్యూమనాయిడ్ రోబోల‌ వినియోగం, భద్రతా పర‌మైన అంశాల‌పై ప‌రిశీలిస్తున్నారు. ఈ ఘటనను చూసిన కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు సరదాగా “పోలీసులు అరెస్ట్ చేసిన తొలి రోబో ఇదే కావచ్చు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read Also: పాత పెళ్లి పత్రికలతో పిచ్చుకలకు కొత్త గూడు

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>