కలం, తెలంగాణ బ్యూరో : ప్రముఖ కవి నందిని సిధారెడ్డికి (Nandini Sidha Reddy) 2025 సంవత్సరానికిగాను సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన 2020 సంవత్సరంలో రచించిన అనిమేష (Animesha) అనే కవితా సంకలనానికి ఈ అవార్డు లభించింది. రచయితలు, సాహితీవేత్తలు మధురాంతకం నరేంద్ర, డాక్టర్ ఎన్.గోపి, డాక్టర్ కె. కోటేశ్వరరావులతో కూడిన జ్యూరీ ఈ అవార్డుకు తెలుగులో నందిని సిధారెడ్డిని ఎంపిక చేసింది. మొత్తం 24 భారతీయ భాషల్లో సాహిత్య అకాడమీ అవార్డు ఎంపిక కోసం రెండు నెలల పాటు జరిగిన కసరత్తు కొలిక్కి వచ్చింది. తెలుగులో మొత్తం తొమ్మిది కథా సంకలనాలు, కథలు, కథానికలు, నవలలు, సాహిత్య విమర్శ, సాహితీ వ్యాసాలు.. ఇలాంటివాటిని అకాడమీ బోర్డు పరిశీలించింది.
చివరకు నందిని సిధారెడ్డి (Nandini Sidha Reddy) రచించిన అనిమేష ఎంపికైంది. ఈ రచనతో పాటు పెద్దింటి అశోక్ కుమార్ రచించిన గుండెలో వాన, అట్టాడ అప్పలనాయుడు రచించిన బహుళ, హనీఫ్ రచించిన ఇప్పుడే వస్తా, చింతకింది శ్రీనివాసరావు రచించిన మున్నేటి గీతాలు, ఆడెపు లక్ష్మీపతి రచించిన దిక్చక్రం, మందలపర్తి కిషోర్ రచించిన ఇరవైలో అరవై, ఆశారాజు రచించిన నన్ను నేను దగ్గరగా చూశాను తదితర రచనలను జ్యూరీ పరిశీలించి చివరకు అనిమేష రచనను ఎంపిక చేసింది.
Read Also: పాత పెళ్లి పత్రికలతో పిచ్చుకలకు కొత్త గూడు
Follow Us On : WhatsApp

