నరసింహస్వామి సన్నిధిలో ఏకాదశి లక్ష పుష్పార్చన

కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో (Yadadri Temple) గురువారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానాలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను వివిధ రకాల పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం వివిధ రకాల సుగంధ పరిమళ పుష్పాలతో స్వామివారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్ర సంప్రదాయాన్ని అనుసరిస్తూ అర్చక స్వాములు ప్రత్యేక పూజలు, అర్చనలు శాస్త్రోక్తంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, అధికారులు పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి ప్రత్యేక అలంకరణ, పుష్పార్చన భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>