ముజ్గి సమీపంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

కలం, నిర్మల్‌ రూరల్: నిర్మల్ రూరల్ మండలం ముజ్గి గ్రామ సమీపంలో (Mujgi village) గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ లింబాద్రి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. దిలావర్‌పూర్‌ మండలం మాయాపూర్‌ గ్రామానికి చెందిన యార శ్రీను (47) అనే వ్యక్తి బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ముజ్గి గ్రామ వై జంక్షన్‌ సమీపంలో గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనుకు తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ  పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>