హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కూకట్‌పల్లి(Kukatpally) పోలీస్ స్టేషన్ పరిధిలోని గూడ్స్ షెడ్ రోడ్డులో ఉన్న ఇండియన్ కంటైనర్ కార్పొరేషన్ డిపోలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. రసాయనాలు నిల్వ చేసే గోడౌన్‌లో మంటలు చెలరేగినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, మంటలు చెలరేగడానికి కారణం ఏంటి? అనే అంశం తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? ఆస్తి నష్టం ఎంత వరకు జరిగి ఉండొచ్చు అని అంచనాలు వేస్తున్నారు పోలీసులు.
Read Also: శక్తులున్న చెంబు అంటూ రూ.1.5కోట్లు టోకరా..

