కలం, వెబ్ డెస్క్: చలికాలం (Winter)లో సాధారణంగా బద్ధకం అవహిస్తుంటుంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న వేళ పడక గదికే పరిమితం కావాలని ఉంటుంది. ఆరు బయటకు అడుగు పెట్టాలనిపించదు. దీంతో ఎక్కడా లేని బద్ధకం (Lazy) వచ్చేస్తుంది. రోజంతా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. పని మీద దృష్టి పెట్టలేం. వీటి వెనుక అనేక కారణాలున్నాయి. కేవలం వాతావరణ మార్పులే కాదు.. సూర్యకాంతి తక్కువగా ఉండటం, హార్మోన్ల మార్పుల వల్ల శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి.
పబ్లిక్ హెల్త్ జర్నల్ బయోమెడ్ సెంట్రల్ (BMC) అధ్యయనం ప్రకారం.. సూర్యరశ్మి తక్కువగా ఉండటంతో నిద్రపై ప్రభావం చూపుతుంది. తక్కువ కాంతి కారణంగా నిద్ర హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. ఇది చురుకుదనాన్ని తగ్గిస్తుంది. దినచర్యలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు.
చలి కారణంగా ఆరుబయట వ్యాయామం చేయడం కష్టమవుతుంది. అలాంటప్పుడు కొన్ని ఇండోర్ వ్యాయామాలు చేయాలి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉండేలా చేస్తాయి. చలికాలం(Winter)లో సూర్య కాంతి (Sun Light) తక్కువగా ఉండటంతో విటమిన్ డీ లోపం మూడీగా ఉండేలా చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు సూర్యకాంతిలో ఉండాలి. అలాగే శరీరానికి శక్తి, వెచ్చదనం, రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలను అందించే ఆహారాలను తీసుకోవడం ముఖ్యం. మనస్సుకు నచ్చిన మ్యూజిక్ వినడం వల్ల కూడా ఉత్సాహంగా ఉండొచ్చు.
Read Also: పొల్యూషన్ నుంచి ప్రొటెక్షన్ ఎలా?
Follow Us On: Instagram


