epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

టాలెంటెడ్ రైటర్స్ కోసమే.. ప్రభాస్ బంఫర్ ఆఫర్

కలం, వెబ్​ డెస్క్​ : సినిమా పరిశ్రమలో రాణించాలని చాలా మంది కథా రచయితలు భావిస్తారు..సరైన అవకాశం రాక ఇబ్బంది పడుతారు. అలాంటి వారి కోసం ప్రభాస్ బంఫర్ ఆఫర్ ఇచ్చారు. సినిమా పరిశ్రమలోకి ఎంతో మందికి అసలు అవకాశాలు రాక ఇబ్బంది పడుతుంటారు. తమ కలను నిరూపించుకునేందుకు ఎంత ప్రయత్నం చేసినా.. అవకాశం రాక.. నిరాశతో ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయే వాళ్ళు ఎక్కువమందే ఉంటారు. టాలెంట్ ఉండి.. అవకాశాలు రాని వారి కోసం..వారి ప్రతిభను ప్రపంచానికి చూపించేందుకు ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ (The Script Craft) వెబ్ సైట్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అదిరిపోయే అవకాశం కల్పిస్తుంది. ప్రతిభ గల రచయితలను ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందిన ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. ఈ ఫిలిం ఫెస్టివల్ ను రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రారంభించారు.

ప్రపంచవ్యాప్తంగా ఏ ఫిలింమేకర్ అయినా ఈ షార్ట్ ఫిలిం ఫెస్టివల్(Short Film Festival) లో పాల్గొనవచ్చు. 2 నిమిషాలకు మించిన లఘు చిత్రాలను ఏ జానర్ లో అయినా పంపించవచ్చు 90 రోజుల పాటు ఈ కాంటెస్ట్ జరగనుంది.ఈ కార్యక్రమం గురించి దర్శకులు సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్, హను రాఘవపూడి తమ స్పందన తెలియజేశారు.వెండితెరపై ప్రతి గొంతు వినిపించాలి, ప్రతి ఒక్కరి కల నిజం కావాలి, కొత్త కథల్ని చెప్పాలనుకుంటున్న ప్రతిభావంతులకు ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ (The Script Craft) ఆహ్వానం అందిస్తోందని ప్రభాస్ అన్నారు. ఫిలింమేకింగ్ ప్రాసెస్ లో షార్ట్ ఫిలింస్ చేయడం మొదటి అడుగు. మీరు క్రియేటివ్ గా రాసుకునే స్క్రిప్ట్, దాన్ని అంతే పర్పెక్ట్ గా తెరకెక్కించడం, రెండూ భిన్నమైనవని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెలిపారు.

Read Also: భయపెడుతున్న‌ ‘ఈషా’ స్పెషల్ వార్నింగ్ వీడియో!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>