సాగునీటి కోసం తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా

కలం, నల్లగొండ బ్యూరో : సాగునీటి కోసం మునుగోడు (Munugode) మండల రైతాంగం కదం తొక్కింది. మండలంలోని 17 గ్రామాల రైతులు మండలంలోని మార్కెట్ యార్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతుసంఘం నాయకులు మాట్లాడుతూ.. మునుగోడు (Munugode) ప్రాంతానికి బ్రాహ్మణ వెల్లంలలోని ఉదయ సముద్రం ప్రాజెక్టు నుంచి 7ఆర్ కాలువ, కిష్టాపురం కాలువ ద్వారా 17 గ్రామాలకు సాగునీరు అందుతుందని ఆశించామన్నారు. కానీ ఉదయ సముద్రం నుంచి కాలువలు పూర్తికాక సాగునీరు అందక తమ పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

భూగర్భ జలాలు తగ్గిపోవడంతో తమ బోరు బావులు ఎండిపోతున్నాయని తమ గోడును ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు వివరిస్తే పట్టించుకోవడంలేదన్నారు. మునుగోడు ప్రాంతానికి వెంటనే సాగునిరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని, లేనిపక్షంలో రైతులంతా ఏకమై ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గట్టుపల్లి నర్సిరెడ్డి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురజా రామచంద్రం, మాజీ ఎంపీపీ పోలగోని సత్యం, మాజీ జెడ్పిటిసి అంజయ్య, ఇప్పర్తి మాజీ సర్పంచ్ బూడిద లింగయ్య యాదవ్, తీర్పారి వెంకటేశ్వర్లు, కైలాష్, సైదులు, గోస్కొండ లింగయ్య, రైతులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>