కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలు.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) మున్సిపాలిటీలో ఎనిమిది గంటలపాటు ఏసీబీ సోదాలు చేసింది. ఉదయం 10 గంటలకు మొదలైన సోదాలు సాయంత్రం 6 గంటల వరకూ సోదాలు కొనసాగాయి. శానిటేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ శాఖలపై వచ్చిన ఫిర్యాదులపై ఏసీబీ స్పందించింది. కామారెడ్డి పట్టణంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. అక్రమ నిర్మాణాల్లో పెద్ద ఎత్తున కమీషన్లు తీసుకుని అనుమతులు ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 2025-26 సంవత్సరంలో అనధికార నిర్మాణాలపై 47 ఫిర్యాదులు వచ్చినా నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఎలాంటి చర్య తీసుకోలేదని ఏసీబీ (ACB) తనిఖీల్లో తేలింది. పట్టణంలోని కమర్షియల్ షాపుల లైసెన్సులపై సైతం ఆరోపణలున్నాయి. 400కుపైగా వాణిజ్య షాపుల ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్స్ పెండింగ్‌లో ఉన్నట్టుగా ఏసీబీ గుర్తించింది.

అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి సుమారు రూ. కోటి బకాయిలు ఏర్పడ్డాయని ఏసీబీ పేర్కొంది. ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్‌మెంట్లలో తేడా కారణంగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్టుగా నిర్ధారణకు వచ్చారు. మున్సిపల్ అధికారుల ఫ్యుయెల్ ఛార్జీల్లో చేతివాటం ప్రదర్శించినట్టుగా కూడా తెలిసింది. నెలకు రూ.12.40 లక్షలు కేటాయించినా, సరైన రికార్డులు లేవని అధికారులు గుర్తించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో భారీ వ్యత్యాసం బయటపడింది. అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగులను గైర్హాజరుగా మార్క్ చేసినా పూర్తి నెల జీతం చెల్లించారు. పూర్తి జీతం చెల్లింపులను దారి మళ్లించారనే ఆరోపణలున్నాయి. భవన నిర్మాణాల అనుమతుల్లో జాప్యం ఉందని ఏసీబీ తనిఖీల్లో బట్టబయలయ్యాయి. డిసెంబర్ 2025 నుంచి 169 బిల్డింగ్ పర్మిషన్ దరఖాస్తుల్లో 18 ఆలస్యంగా ప్రాసెస్ అయ్యాయని తేలింది. తనిఖీల రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>