సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ కోసం రైతు ఉద్యమం: పాపయ్య

కలం, నిజామాబాద్ బ్యూరో: 16 ఏళ్లుగా మూతపడి ఉన్న ఎన్సీఎస్ఎఫ్ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని (Sarangapur Sugar Factory) రాష్ట్ర ప్రభుత్వం తెరిపించేందుకు రైతు ఉద్యమం చేపడుతామని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య వెల్లడించారు. శనివారం మోపాల్ మండలం కంజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల పాపయ్య మాట్లాడుతూ.. గత పాలకుల తప్పుడు విధానాలు ఆనాటి అవినీతి అధికారుల మూలంగా మంచి లాభాల బాటలో నడచిన సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని మూసివేశారని అన్నారు.

జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న ఈ చక్కెర ఫ్యాక్టరీ (Sarangapur Sugar Factory) పరిధిలో నాలుగు శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని 110 గ్రామాల రైతులు చెరుకు పండించి ఫ్యాక్టరీ పంపారని ఈ ప్రాంత రైతులకు చెరుకు పండించిన అనుభవం ఉందని వారన్నారు. ప్రభుత్వం ఒక దిక్కు ఆరుతడి పంటల వైపు వెళ్ళమంటున్నందున చెరుకు పంట కూడా ఆరుతడి పంట అయినందున 70 గ్రామాలలో చెరుకు పండించేందుకు రైతులు ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు.

ప్రభుత్వం ఇటీవల ఎల్ నినో (El Nino) ప్రభావం వల్ల నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షలో సమావేశాలు పెట్టి ఆరుతడి పంటలు వేయమని చెప్పిందన్నారు. చెరుకు పంట చక్కెర ఫ్యాక్టరీ తెరిపించే విషయంలో కూడాపై సానుకూల అంశాల్ని ఆలోచిస్తుందని జిల్లా స్థాయి అధికారులు ప్రభుత్వ పెద్దలు అన్నారని పాపయ్య గుర్తు చేశారు.

ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ.. NCSF చక్కెర ఫ్యాక్టరీ ప్రారంభించి దాన్ని బెల్లం కేంద్రంగా ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ జిల్లా వాసియేనని, ప్రభుత్వాన్ని నడుపుతున్న అధికార పార్టీకి అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఈ జిల్లా వాసియేనని అన్నారు. అలాంటి పెద్దలంతా NCSF సారంగాపుర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి.. దాన్ని బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడిపే విధంగా తగిన కృషి చేయాలని కోరారు.

ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, ఉప సర్పంచ్ గుడి ప్రవీణ్ రెడ్డి, టెక్ మాల్ లక్ష్మణ్,భాస్కర్ అగ్గు ఎర్రన్న, తుంగపల్లి రాజ్ కుమార్, జి గంగాధర్, గుండ్ల రవి చిన్నారెడ్డి, చిన్న పోతన్న, సాయిలు, అగ్గు చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Also Read : యువతకు అజిత్ దోవల్ కీలక సూచన

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>