Mobile Popup Ad
Mobile Popup Ad

మా ధాన్యం కొనండి.. రామకృష్ణ కాలనీ రైతుల విన్నపం

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) పరిధిలోని ముంపునకు గురై ఎఫ్టీఎల్​కు దూరంగా ఖాళీగా ఉన్న భూముల్లో పండించిన వరిని (Paddy) కొనుగోలు చేయాలని రామకృష్ణ కాలనీ రైతులు కోరారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఎల్ఎండీ రిజర్వాయర్ పరిధిలో సొంత భూముల్లో 25 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నామని, కానీ తాము పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం తప్ప, ఇతర పనులు చేయలేని తమను వెంటనే ఆదుకోవాలని కోరారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వ్యవసాయ అధికారి ద్వారా అనుమతి తీసుకొన్న తర్వాత కొనుగోలు చేశారని గుర్తుచేశారు. తహసీల్దార్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యను పరిష్కరిస్తానని హామీఇచ్చారు. తహసీల్దార్​కు వినతిపత్రం ఇచ్చినవారిలో గోనెల భూమయ్య, గంగు రాజమల్లు, కోతి మల్లేశం, ఆవుల లచ్చయ్య, గంగు తిరుపతి, అట్ల అంజయ్యతోపాటు బీజేపీ నాయకులు గడ్డం అరుణ్, కోతి రాజు, న్యాయవాది సుగుర్తి జగదీశ్వరాచారి ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>