కలం వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ప్రీమియర్ షో (Premiere Show) టికెట్‌ల హంగామా మొదలైపోయింది. ఈ సందర్భంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని శ్రీ వెంకటరమణ థియేటర్ వద్ద చిరంజీవి యువత ఆధ్వర్యంలో ప్రీమియర్ షో టికెట్‌ల వేలం నిర్వహించారు. ఈ వేలంలో మేకా సుబ్బారావు అనే వ్యక్తి ఏకంగా రూ.1.11 లక్షలు పెట్టి మొదటి ప్రీమియర్ షో టికెట్‌ను దక్కించుకున్నారు. మోకా సుబ్బారావు బీజేపీకి చెందిన రాజకీయ నాయకుడు.
గతంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఈ నగదును చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టుకు (Chiranjeevi Charitable Trust) అందజేస్తామని చిరంజీవి యువత సభ్యులు వెల్లడించారు. సంక్రాంతి సందర్భంగా వస్తున్న చిరు సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మరోవైపు టికెట్ల రేట్ల పెంపు కోసం ప్రభుత్వంతో నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. దీనిపై నేడు కోర్టులో విచారణ జరుగనుంది.
Read Also: సమంత కొత్త సినిమాపై బిగ్ అప్డేట్..!
Follow Us On: Pinterest


