కలం వెబ్ డెస్క్ : టాలీవుడ్(Tollywood)లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన సమంత (Samantha) బాలీవుడ్ వైపు వెళ్లాక తెలుగు సినిమాలను పలకరించడమే మానేసింది. సినిమాలతో కాకున్నా వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలిచిన సమంత ఇప్పుడు తన కొత్త సినిమా గురించి బిగ్ అప్డేట్ ఇచ్చింది. నందిని రెడ్డి (Nandini Reddy) డైరెక్షన్‌లో సమంత నటిస్తున్న తాజా చిత్రం “మా ఇంటి బంగారం” (Maa Inti Bangaram). ఈ సినిమాపై గతంలో నందినీ రెడ్డి చేసిన అనౌన్స్ మెంట్ మినహా ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా సమంత తన ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో మా ఇంటి బంగారం సినిమా పోస్టర్(Poster) విడుదల చేసింది.
ఈ పోస్టర్ లో సమంత చీర కట్టుకొని ఓ బస్సులో సీరియస్ లుక్ ఉంది. తన పోస్టుకు “మీరు చూస్తా ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది” అనే క్యాప్షన్‌ను జోడించింది. అలాగే ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 9న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు సామ్ ప్రకటించింది. ఈ సినిమాకు సామ్ భర్త రాజ్ నిడిమోరు (Raj Nidimoru) సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత సమంత కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: ఫుట్‌బాల్ క్లబ్ చెల్సికు కొత్త కోచ్
Follow Us On : WhatsApp


