Mobile Popup Ad
Mobile Popup Ad

నకిలీ జర్నలిస్టు వ‌సూళ్ల ప‌ర్వం.. అరెస్ట్ చేసిన పోలీసులు!

కలం, కరీంనగర్ బ్యూరో: విలేకరుల ముసుగులో కొంతమంది నకిలీ జర్నలిస్టులు వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు. తాజాగా వేములవాడ (Vemulawada) పట్టణంలోని ఓ సూపర్ మార్కెట్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన నిందితుడిని వేములవాడ టౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ వివ‌రాలు వెల్ల‌డించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటకు చెందిన గోడిశేల మహేష్ అనే వ్యక్తి జర్నలిస్టుగా పరిచయం చేసుకొని, సూపర్ మార్కెట్ యజమానిని భయభ్రాంతులకు గురి చేశాడు. అధికారులతో తనిఖీలు చేయిస్తానని, పత్రికల్లో వ్యతిరేక వార్తలు రాస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. క‌త్తితో బెదిరించి బాధితుడి నుండి ఫోన్ పే ద్వారా రూ.42,000 వసూలు చేశాడు.

Read Also: మంగ్లీ, సుబ్బారావు కాంట్రవర్సీ… మధ్యలో శ్రీముఖి ఎంట్రీ!

నిందితుడు మళ్లీ డబ్బుల కోసం వేధిస్తుండటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఎస్‌ఐ రామ్మోహన్, కానిస్టేబుల్ గోపాల్ దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎవరైనా మీడియా ముసుగులో, అధికారుల పేరుతో బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితుడు మహేష్ చేతిలో మరెవరైనా మోసపోయి ఉంటే స్టేషన్‌లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>