కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ సింగర్ మంగ్లీ (Mangli) వరుస వివాదాలతో సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. బర్త్ డే పార్టీ వివాదం, డ్రగ్స్ ఆరోపణలు, పాటలో అశ్లీల పదాల కేసు… ఇలా తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మంగ్లీ మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. మంగ్లీ తనను మోసం చేయడమే కాకుండా చంపేస్తానని బెదిరిస్తోందని సుబ్బారావు అనే న్యాయవాది పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనికి కౌంటర్‌గా మంగ్లీ కూడా సుబ్బారావుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుబ్బారావు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, డబ్బులు డిమాండ్ చేస్తూ తనను వేధిస్తున్నాడని, తనపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరింది. ఇక సుబ్బారావు, మంగ్లీల వివాదం మధ్య యాంకర్ శ్రీముఖి (Sreemukhi) పేరు చర్చలోకి రావడం సంచలనంగా మారింది.
సుబ్బారావుపై ఆరోపణలు చేస్తూ మంగ్లీ పలు విషయాలు వెల్లడించింది. సుబ్బారావు సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పింది. ఆయనకు బిగ్‌బాస్ షోకు వెళ్లాలని ఉందని తెలిపింది. ఇక యాంకర్ శ్రీముఖిపై (Sreemukhi) సుబ్బారావుకు క్రష్ ఉందని ఆరోపించింది. ఆ విషయం సుబ్బారావు స్వయంగా తనతో చెప్పినట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఒక సంచలన వీడియోను కూడా బయటపెట్టింది సదరు వీడియోలో సుబ్బారావు మంగ్లీని (Mangli) దుర్భాషలాడటం గమనార్హం. ఇక వీరిద్దరి ఫిర్యాదుల మీద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: ఎండాకాలంలో ప్రత్యేకం.. జనగామలో ఈత పండ్ల సందడి
Follow Us On: X(Twitter)

