హనుమకొండలో నకిలీ వైద్యుడి క్లినిక్‌పై డీసీఏ దాడి

కలం, హనుమకొండ : హనుమకొండ (Hanumakonda) జిల్లా ఏనుగులగడ్డ ఇందిరానగర్‌లో నకిలీ వైద్యుడి క్లినిక్‌పై డీసీఏ (డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్) అధికారులు శుక్రవారం దాడి నిర్వహించారు. బత్తుల రాజు కుమార్ అనే వ్యక్తి సరైన అర్హతలు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించిన అధికారులు క్లినిక్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో అక్రమంగా నిల్వ ఉంచిన మందులను స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం 41 రకాల మందులు గుర్తించగా, అందులో 35 రకాల ఇన్‌స్టిట్యూషనల్ సప్లై మందులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మందుల విలువ సుమారు రూ.10,000 వరకు ఉంటుందని పేర్కొన్నారు. క్లినిక్‌లో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వంటి మందులు అక్రమంగా వినియోగిస్తున్నట్లు గుర్తించామని, ఇది ప్రజారోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉందని డీసీఏ అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Read Also: అండమాన్ దీవుల్లో భారీగా గ్యాస్ నిక్షేపాలు.. కేంద్రం ప్రకటన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>