జనగామలో సుర్రుమన్న సూరీడు.. 43 డిగ్రీలు దాటేసింది!

కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లాలో ఎండలు రోజురోజుకు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. గురువారం ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్‌ దాటేసింది. జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ప్రధాన రహదారులు, బజార్లు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర పనులుంటే తప్ప ఎవరూ బయటకు రావడం లేదు. వడగాలుల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో, ప్రత్యేకంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎండల ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వైద్యుల హెచ్చరికలు..

అధిక ఉష్ణోగ్రతల కారణంగా సన్‌స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉందని, ఎండలో ఎక్కువసేపు తిరగకూడదని సూచిస్తున్నారు. ఆసుపత్రులకు వేడి సంబంధిత సమస్యలతో వచ్చే రోగుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నట్లు సమాచారం. రైతులు, కూలీలు ఎండల కారణంగా పనులు తగ్గించుకోవాల్సి వస్తోంది. వ్యవసాయ పనులు ఉదయం 9 గంటల లోపు లేదా సాయంత్రం 5 దాటిన తరువాత మాత్రమే చేస్తున్నారు. నిర్మాణ రంగంలో పనిచేసే కూలీలు కూడా మధ్యాహ్న సమయంలో పనులను నిలిపివేస్తున్నారు.

పట్టణాల్లో తీవ్రంగా తాగునీటి కొరత..

ఉమ్మడీ వరంగల్ జిల్లాలోని ప్రధాన నగరాల్లో తాగునీటి కొరత తలెత్తుతోంది. అధిక వేడి కారణంగా నీటి వినియోగం పెరగడంతో ఆదా చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, రాబోయే కొన్ని రోజులు కూడా ఎండల తీవ్రత తగ్గే సూచనలు లేకపోగా.. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎండలు అధికంగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read Also: టోఫు తింటేనే ఆడవారిని గౌరవించినట్లా..? నెట్టింగ్ మరో వింత థీరీ..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>