పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఏమాత్రం కొరత లేదు: కిషన్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఏమాత్రం కొరత లేదని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ అమ్మకపు గణాంకాలను పరిశీలిస్తే, సాధారణ రోజుల కంటే బుధవారం రికార్డు స్థాయిలో సరఫరా జరిగిందని తెలిపారు. పెట్రోల్ రోజువారి సాధారణ సగటు 6,920 కిలోలీటర్లు కాగా, బుధవారం 12,875 కిలోలీటర్లు సరఫరా జరిగిందని వివరించారు.

ఇక డీజిల్ రోజువారి సాధారణ సగటు 9,017 కిలోలీటర్లు కాగా, బుధవారం 21,295 కిలోలీటర్లు పంపిణీ జరిగిందని చెప్పారు. డిమాండ్‌కు మించి సరఫరా జరుగుతున్నందున సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మి అనవసరంగా పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టవద్దని కోరారు. అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని ఆయన (Kishan Reddy) ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read Also: టోఫు తింటేనే ఆడవారిని గౌరవించినట్లా..? నెట్టింగ్ మరో వింత థీరీ..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>