Mobile Popup Ad
Mobile Popup Ad

పెట్రోల్, డీజిల్‌ను బంకులలో సమృద్ధిగా ఉంచుకోవాలి: కలెక్టర్ అంకిత్

కలం, ఖమ్మం బ్యూరో: పెట్రోల్, డీజిల్‌ను బంకులలో సమృద్ధిగా ఉంచుకోవాలని డీలర్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పెట్రోల్ బంకు యజమానులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పెట్రోల్ బంకుల యజమానులు ప్రజలకు అన్ని వేళల్లో ఇంధనాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు. చమురు కంపెనీల నుంచి సకాలంలో ఇండెంట్లు పెట్టీ, ముందొస్తుగా పెట్రోల్ డీజిల్ బంకులలో సమృద్ధిగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. ప్రజలందరికీ పెట్రోల్ ఉత్పత్తులు ఏ ఆటంకం లేకుండా అందించాలన్నారు.

అలాగే బ్లాక్ మార్కెట్ కు కానీ, అక్రమంగా అధిక రేట్లకు అమ్మడం కానీ చేయరాదని హెచ్చరించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చమురు కంపెనీలకు సంబంధించిన బీపీసీఎల్ సేల్స్ ఆఫీసర్లు సమావేశానికి హాజరు కాగా, హెచ్పీసీఎల్ సేల్స్ ఆఫీసర్ హాజరు కాకపోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా పౌర సరఫరాల అధికారి ఏం. ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>