Mobile Popup Ad
Mobile Popup Ad

జూ.ఎన్టీఆర్ స్పెషల్ ట్వీట్.. బన్నీ షాకింగ్ రిప్లై..!

కలం, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) బర్త్ డే నేడు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ( Jr NTR) సైతం ఆయనకు ట్విట్టర్ లో బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ మేరకు ”హ్యాపీ బర్త్ డే బావా.. హావ్ ఏ ఫంటాస్టిక్ డే టుడే.. ఈ సంవత్సరం నీకు పెద్ద పెద్ద విజయాలు తీసుకురావాలి. నీకు కొండంత ప్రేమను పంపిస్తున్నాను” అంటూ జూ.ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్టు చేశారు. దీంతో ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.

ఇక జూ.ఎన్టీఆర్ చేసిన పోస్టుకు అల్లు అర్జున్ వెంటనే రిప్లై ఇచ్చేశాడు. ”బావా.. థ్యాంక్యూ సో మచ్.. మీ విషెస్ కు నీకూ కొండంత ప్రేమ అందిస్తున్నా” అని రిప్లై ఇచ్చేశాడు. దీంతో వీరి బాండింగ్ చూసి ఇరువురు ఫ్యాన్స్ ఫీదా అయిపోతున్నారు. సాధారణంగా వెండితెరపై పోటీ ఉండే హీరోల మధ్య వ్యక్తిగతంగా ఇంతటి సాన్నిహిత్యం ఉండడం గ్రేట్ అని కొనియాడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఎంతటి పోటీలో ఉన్నా.. టాప్ హీరోలు ఒకరినొకరు గౌరవించుకోవడం పరిశ్రమలో ఉన్న ఐక్యతకు నిదర్శమని పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

కాగా, అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం అట్లీ కుమార్ (Atlee) దర్శకత్వంలో ‘రాకా’ అనే పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్నారరు. హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ను అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా బుధవారం రివీల్ చేశారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. అటు జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా యాక్షన్ మూవీ ”డ్రాగన్” లో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Read Also: షాకింగ్.. ఆ విషయం బయటపెట్టిన పవన్ కళ్యాణ్ భార్య!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>