45 మందితో రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ నూతన కార్యవర్గం

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) ఉమ్మడి జిల్లాలోని రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా కాంగ్రెస్(Congress) పార్టీ నూతన కార్యవర్గాన్ని అధికారికంగా ప్రకటించారు. మొత్తం 45 మందితో కూడిన కార్యవర్గాన్ని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నూతన కమిటీలో జిల్లా ఉపాధ్యక్షులుగా కూరగాయల కొమురయ్య, పిల్లి కనకయ్య, కొండం రాజిరెడ్డి, పులి రాంబాబు, దత్తాత్రేయ గౌడ్, చొప్పదండి ప్రకాష్‌లను  నియమించారు.

ప్రధాన కార్యదర్శులుగా వి. శ్రీనివాస్, చేపూరి గంగాధర్, గట్టె రుక్మిణి, యెల్ల బాల్ రెడ్డి, లింగాల భూపతి, సిహెచ్ రామస్వామి, మంగ కిరణ్, ఎస్.కె. ఫిరోజ్ పాషా, టి. జలపతి, వేముల దామోదర్, రాగుల జగన్, వంగ గిరిధర్ రెడ్డి, ఎస్. శ్రీనివాస్, బైరి గంగమల్లయ్య, కూతురు వెంకటరెడ్డి, గాదమశెట్టి బాల లక్ష్మిలను ఎంపిక చేశారు. కోశాధికారిగా రంగు వెంకటేష్ నియమితులయ్యారు. అధికార ప్రతినిధులుగా చిలుక రమేష్, వైద్య శివప్రసాద్ ఎంపికయ్యారు.

అలాగే సెక్రటరీలుగా జక్కు మోహన్, మిర్యాలకర్ శ్రీనివాస్, లింగంపల్లి ఎల్లాగౌడ్, కాడవెరుగు ప్రకాష్, పండుగ ప్రదీప్, బానోతు రామదాసు, అరుణ్ తేజ్ చారి, ఎదురుగట్ల వనిత, సామల రోజా, అల్వాల చందు, బూత శ్రీనివాస్ గౌడ్, చొక్కాల రాము, షేక్ మోయినమోయిజ్, మూల రామచంద్రారెడ్డి, నాగుల విష్ణు ప్రసాద్‌లను  నియమించారు. కార్యవర్గ సభ్యులుగా చిందం శ్రీనివాస్, దూలం నారాయణ, మేడిపల్లి రాంరెడ్డి, ద్యావల దిలీప్, మల్యాల రాజవీరులకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి, జిల్లా అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని పార్టీ నాయకత్వం ఆకాంక్షించింది.

Read Also: నెక్లెస్ రోడ్ జలవిహార్ సమీపంలో భారీ పేలుడు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>