కలం, వెబ్‌డెస్క్: ఖర్జూర పండ్లు (Dates) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అద్భుతమైన పోషక ఆహారం. ఇవి కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఖర్జూరంలో ఐరన్ శాతం అధికంగా ఉండటంతో ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, రక్తహీనత రాకుండా కాపాడుతుంది. కానీ ఖర్జూరాలలో సహజమైన చక్కెర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్/షుగర్ ఉన్నవారు వీటిని తినేందుకు ప్రత్యేక నియమాలు పాటించాలని నిపుణులు (Expert Guide) సూచిస్తున్నారు.
ఖర్జూరాలలో ఉండే సహజమైన చక్కెర రక్తంలో షుగర్ లెవెల్స్ సడెన్‌గా పెంచుతుంది. అలా పెరగకుండా ఉండేందుకు ఖర్జూరాలను ఎలా తినాలో నిపుణులు కొన్ని చిట్కాలను వివరించారు. అయితే ఖర్జూరాలను ఒట్టిగా తినడం కంటే వాటితో పాటు కొవ్వులు, ప్రొటీన్లు ఉండే నట్స్ కలిపి తింటే జీర్ణక్రియ నెమ్మదిగా చేస్తుందని తెలిపారు. సాయంత్రం స్నాక్స్ గా.. బాదం, వెన్న నింపిన ఒక ఖర్జూరం లేదా కొన్ని వాల్‌నట్స్‌తో కలిపి రెండు చిన్న ఖర్జూరాలు తింటే చాలా మంచిదట. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగకుండా చూస్తుందని, అంతేకాకుండా తీపి తినాలని కోరికలను కూడా తీరుస్తుందంటున్నారు నిపుణులు.
వ్యాయామానికి ముందు
మనం ఖర్జూరాలు (Dates) తినే సమయం కూడా శరీరంపై చాలా ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. రాత్రిపూట కదలకుండా కూర్చున్నప్పుడు తినడం కంటే, శారీరక శ్రమకు ముందు తినడం మంచిది అని సూచిస్తున్నారు. ఏదైనా వ్యాయామానికి 20-30 నిమిషాల ముందు ఒకటి లేదా రెండు ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి వెంటనే శక్తి లభిస్తుందట. రన్నర్లు, అథ్లెట్లు ఈ పద్ధతినే పాటిస్తారు. వ్యాయామం చేయడం వల్ల కండరాలు ఇన్సులిన్‌ను బాగా గ్రహిస్తాయి. దీనివల్ల ఖర్జూరాల నుండి వచ్చే గ్లూకోజ్ రక్తంలో పేరుకుపోకుండా శక్తిగా మారుతుందని తెలిపారు.
ఎలా తినాలి
ఖర్జూరాలలో ఉండే పీచు పదార్థం ఆహారంలోని చక్కెరను శరీరం నెమ్మదిగా గ్రహించేలా చేస్తుంది. ఖర్జూరాలను నేరుగా తినే కంటే.. ఓట్స్, తీపి లేని గ్రీక్ పెరుగు లేదా చియా పుడ్డింగ్‌లో ముక్కలుగా కోసి కలుపుకోవాలి. ఓట్స్, చియా గింజలలో ఉండే ఫైబర్ ప్రేగులలో ఒక జెల్ లాగా ఏర్పడి, చక్కెర రక్తంలో ఒక జెల్ లాగా ఏర్పడి, చక్కెర రక్తంలో త్వరగా కలవకుండా అడ్డుకుంటుంది.
రోజుకు ఎన్ని తినాలి
ఖర్జూరాలు పోషక విలువలు ఉన్నవే అయిన.. వాటిలో కేలరీలు ఎక్కువ. ఒక పెద్ద ఖర్జూరంలో దాదాపు 16 గ్రాముల చక్కెర ఉంటుంది. ఒకేసారి 6 లేదా 7 ఖర్జూరాలు తినకూడదని సూచిస్తున్నారు నిపుణులు. ఎప్పుడైనా సరే ఒకటి లేదా రెండు ఖర్జూరాలు మాత్రమే తినాలి. వీటిని విడిగా చిరుతిండిలా కాకుండా, వంటల్లో వాడే ఒక సహజ తీపి పదార్థంలా భావించాలి. డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూరాలు తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడం మంచిదట.
ఏది బెస్ట్.. ఖర్జూరం సిరప్/పేస్ట్
మార్కెట్లో దొరికే ఖర్జూర ఉత్పత్తులన్నీ ఒకేలా ఉండవు. ఖర్జూర పండులో ఫైబర్ ఉంటుంది కాబట్టి అది సురక్షితం. కానీ ఖర్జూర సిరప్‌లు, ప్యాక్ చేసిన ఖర్జూర పేస్టులు మంచివి కావని సూచిస్తున్నారు నిపుణులు. వీటిలో ఫైబర్ ఉండదు. ఖర్జూర సిరప్ తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరుగుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ఒకవేళ వంటల్లో ఖర్జూర పేస్ట్ వాడితే, దాని గ్లైసెమిక్ ప్రభావాన్ని తగ్గించడానికి బాదం పిండి, గుడ్లు లేదా నట్స్ వంటివి కలిపి వాడాలి. షుగర్ ఫ్రీ లేదా న్యాచురల్ అని ఉన్నా సరే.. అతిగా తింటే ఏ చక్కెర అయినా శరీరానికి నష్టమే చేస్తుందని సూచిస్తున్నారు నిపుణులు.
Read Also: గుమ్మడి కాయ కడుతున్నారా? ఈ పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు!
Follow Us On: WhatsApp

