భారీగా పడిపోనున్న ఆయిల్ ధరలు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

కలం, వెబ్‌ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో నడుస్తున్న యుద్ధాన్ని తాము అతి త్వరలోనే ముగించబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. వైట్ హౌస్‌లో ఫస్ట్ లేడీ మెలానియాతో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

మాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ నిల్వలు భారీ స్థాయిలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ పరిణామాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు (Oil Prices) ఒక్కసారిగా పడిపోబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>