కలం, వెబ్‌సైట్: మన హిందూ సాంప్రదాయంలో కొత్త ఇల్లు కట్టినా లేదా వ్యాపార సంస్థలను ప్రారంభించినా ఇంటి మెయిన్ ద్వారం ముందు పై భాగంలో బూడిద గుమ్మడి కాయ (Pumpkin) కడుతుంటారు. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి ఇంటిలోపలికి ప్రవేశించకుండా ఉంటుందని, సమాజంలో ఉండే నరదిష్టి, ఈర్ష్య, అసూయ వంటి చెడు చూపుల ప్రభావం నేరుగా ఇల్లు లేదా ఇంట్లోని సభ్యులపై పడుకుండా ఉంటుందని అనాధిగా వస్తున్న నమ్మకం (Hindu Belief).
చాలా వరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముఖద్వారం వద్ద గుమ్మడికాయను కడుతుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడే అన్నీ దేవతలు, ముఖ్యంగా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు. అందుకే ప్రధాన ద్వారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ప్రతి రోజూ ప్రధాన ద్వారం వద్ద శుభ్ర పరిచి, అందంగా ముగ్గులు వేసి అలంకరిస్తారు. అయితే ఈ గుమ్మడి కాయను ఇంటి ముందు కట్టేటప్పుడు కొన్ని రకాల పొరపాట్లు చేయకూడదట. మనం చేసే చిన్న తప్పులే అనేక రకాల సమస్యలకు కారణం అవుతాయని చెబుతున్నారు పండితులు. అవేంటో తెలుసుకుందామా?
చేయకూడని తప్పులు
చాలా మంది మార్కెట్ నుంచి గుమ్మడికాయను తీసుకొచ్చి కడుతుంటారు. అయితే కొంతమంది తెలియక మార్కెట్ నుంచి గుమ్మడికాయ ఇంటికి తీసుకురాగానే నీటితో కడుగుతుంటారు. కానీ అలా అస్సలు చేయకూడదని చెబుతున్నారు పండితులు. గుమ్మడికాయను నీటితో కడగడం వల్ల దానిలో ఉన్న శక్తి మొత్తం పోతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనే గుమ్మడి కాయను శుభ్రం చేయకూడదని హెచ్చరిస్తున్నారు.
ఇంకొకటి గుమ్మడి కాయను కొనేముందు చేసే అతి పెద్ద పొరపాటు ఏమిటంటే.. తొడిమ లేని గుమ్మడికాయను కొనడం. ఎప్పుడూ కూడా గుమ్మడికాయను కొనుగోలు చేసే ముందు తొడిమ ఉన్నదే కొనాలట. తొడిమ లేని గుమ్మడికాయ, నిర్జీవమైనది, దీనికి అంతగా శక్తులు ఉండవని సూచిస్తున్నారు నిపుణులు. అందువలన ఎప్పుడు గుమ్మడికాయ కొనుగోలు చేసినా సరే, తొడిమ ఉన్నది మాత్రమే కొనుగోలు చేయడం ముఖ్యం. ఈ గుమ్మడి కాయను అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి కట్టడం వలన మంచి ఫలితాలు ఉంటాయని చెడబుతున్నారు వాస్త్రు శాస్త్ర నిపుణులు.
Read Also: అందానికి ఐస్ మంత్రం.. కొరియన్ బ్యూటీ సీక్రెట్ రివీల్!
Follow Us On: WhatsApp

